2జీ, 3జీ, 4జీకి కొత్త అర్థం చెప్పిన అమిత్‌షా..

2జీ, 3జీ, 4జీకి కొత్త అర్థం చెప్పిన అమిత్‌షా..

ఎన్నికల నగరా మోగడంతో.. విజయం ఎలా సాధించాలన్న ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నాయి అన్ని పార్టీలు.. తమిళనాడులో ఎన్నికల ప్రచారం నిర్వహించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా... ప్రతిపక్షాలపై మండిపడ్డారు.. ఇక, 2జీ, 3జీ, 4జీ అన్నీ తమిళనాడులోనే ఉన్నాయంటూ వాటికి కొత్త అర్థం చెప్పుకొచ్చారు షా.. 2జీ కుంభకోణంలో కాంగ్రెస్, డీఎంకే భాగస్వాములు, 2జీ అంటే రెండు తరాల మారన్ కుటుంబం అని వ్యాఖ్యానించిన అమిత్‌షా... 3జీ అంటే మూడు తరాల కరుణానిధి కుటుంబం అంటూ కామెంట్ చేశారు.. ఇక, 4జీ అంటే నాలుగు తరాల గాంధీ కుటుంబం అంటూ ఆ పార్టీలో ఉన్న వారసత్వ రాజకీయాలను ఎత్తిచూపారు. ఇలా.. తమిళనాడులో డీఎంకే, కాంగ్రెస్ పార్టీపై సెటైర్లు వేశారు షా.. మరోవైపు.. రాహుల్‌ను ప్రధానిని చేయాలనేది సోనియా గాంధీ లక్ష్యం అని.. ఉదయనిధిని సీఎం చేయాలనేది స్టాలిన్ పంతం అంటూ వ్యాఖ్యానించారు.