మొసళ్లు, పాములే ఆయనకు ప్రాణ స్నేహితులు

మొసళ్లు, పాములే ఆయనకు ప్రాణ స్నేహితులు

పామును చూస్తే పరుగులు తీస్తాం. మొసలిని చూస్తే గుండెలు జారిపోతాయి. కానీ.. వాటితోనే సావాసం చేసే ఓ సాహసి ఉన్నాడు. ఫ్రాన్స్ లో వాటితోనే సావాసం చేసే ఆయన పేరు అలీ. ఒక్క పాము, మొసలే కాదు.. సరీసృపాల జాతికి చెందిన అనేక రకాల ప్రమాదకరమైన జీవులు ఆయన దగ్గరున్నాయి. స్వయంగా హెర్పటాలజిస్ట్ అయిన అలీ.. 20 ఏళ్లకు పైగా సరీసృపాల మీద అధ్యయనం చేస్తున్నాడు. వాటిని సేకరించడమే పనిగా పెట్టుకున్నాడు. పాకుడు జాతికి చెందిన 400 పైగా ప్రాణులు ఇప్పుడు ఆయన గార్డెన్లో ఉన్నాయి.  వాటిల్లో ఆరుదైన జాతులకు చెందినవి కూడా ఉన్నాయి. వాటికి బ్రేక్ ఫాస్ట్ పెట్టడం, ఆడుకోవడం.. ఇలా వాటితోడితే జీవితంగా ఆయన ఎంజాయ్ చేస్తున్నాడు. 

వేలాది ఏళ్లుగా జంతువులు వాటంతట అవే కాపాడుకుంటున్నాయని, కానీ మనుషులే వాటిని చంపుతున్నారని ఆయన అభిప్రాయపడతాడు. మనం చేయాల్సింది వాటిని కాపాడటం కాదు... అవి నివసించే పరిసరాలను కాపాడటమే అంటాడు.