ఆళ్ల రామకృష్ణారెడ్డికి కీలక పదవి?

ఆళ్ల రామకృష్ణారెడ్డికి కీలక పదవి?

కేబినెట్ లో స్థానం దక్కలేదని ఆవేదన చెందుతున్న ఎమ్మెల్యేలు ఒక్కొక్కరినే ఏపీ సీఎం జగన్ బుజ్జగిస్తూ వస్తున్నారు. నిన్న రోజాకు ఏపీఐఐసీ చైర్మన్ పదవి ఇచ్చిన జగన్, ఇవాళ మంగళగిరిలో మాజీ మంత్రి నారా లోకేష్ ను ఓడించిన ఆళ్ల రామకృష్ణారెడ్డికి సీఆర్డీఏ (క్యాపిటల్ రీజియన్ డెవలప్ మెంట్ అథారిటీ) చైర్మన్ పదవి ఇవ్వాలని జగన్ నిర్ణయించారు. మరో రెండు రోజుల్లో దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది. మంగళగిరిలో ఆళ్లను గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తానని జగన్ బహిరంగంగా ప్రజలకు హామీ ఇచ్చారు. దీంతో ఆయనకు కేబినెట్ బెర్త్ ఖాయమని భావించినా కొన్ని సమీకరణాల కారణంగా కుదరలేదు. దీంతో ఆళ్లకు సీఆర్డీఏ చైర్మన్ పదవి అప్పగించాలని జగన్ భావించినట్టు తెలుస్తోంది.