'నిద్రపోను...అధికారులను నిద్రపోనివ్వను'

'నిద్రపోను...అధికారులను నిద్రపోనివ్వను'

అధికారులు తప్పుడు సమాచారం చెబితే నమ్మేంత పిచ్చి వాడిని కాదని.. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తే ఇకపై ఉపేక్షించేది లేదని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణరెడ్డి స్పష్టం చేశారు. గత ఐదేళ్లలో ప్రజాధనాన్ని లూటీ చేసిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తే  లేదన్నారు. నిద్రపోను.. అధికారులను నిద్రపోనివ్వను అని స్పష్టం చేశారు. ఇవాళ ఆయన మంగళగిరిలో మాట్లాడుతూ గత ఐదేళ్లలో అధికారులు ప్రజాప్రతినిధులకు ఏమాత్రం సహకరించలేదన్నారు. 
ఎమ్మెల్యేగా గెలిచిన తన విషయంలోనే అధికారులు ప్రోటోకాల్ పాటించలేదని చెప్పారు. అధికారులపై ఒత్తిడి తెస్తే మానసికంగా ఇబ్బంది పడతారేమో అని అప్పట్లో వదిలేశానన్న ఆయన.. భగవంతుడు, ప్రజలు నన్ను ఆశీర్వదించి మళ్లీ ఎమ్మెల్యేగా గెలిపించారని అన్నారు. మండల పరిషత్ సమావేశాలకు ఇకపై అన్ని శాఖల అధికారులు హాజరు కావాల్సిందేనని, గైర్హాజరైన అధికారులపై చర్యలు తప్పవని ఆళ్ల స్పష్టం చేశారు. ప్రజా ప్రతినిధులు పర్సంటేజీలు అడిగితే తన దృష్టికి తీసుకు రావాలని సూచించారు.