బంగారు బుల్లోడు టీజర్..?

బంగారు బుల్లోడు టీజర్..?

ఇంతక ముందు వరుస సినిమాలు చేసిన అల్లరి నరేష్ గత కొన్నేళ్లుగా సరైన హిట్ అందుకోలేకపోయారు. ఆయన ఈ మధ్య చేస్తున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తాపడుతున్నాయి. ఇక ప్రస్తుతం ఆయన‌ హీరోగా వస్తున్న సినిమా బంగారు బుల్లోడు. ఈ సినిమా ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై తెరకెక్కుతుంది, పివి గిరి దర్శకత్వం లో  వస్తున్న ఈ సినిమాలో పూజా జవేరీ హీరోయిన్ గా నటిస్తుంది. సాయి కార్తీక్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. బంగారు బుల్లోడు రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ చిత్రంగా వస్తుంది. అయితే రేపు అల్లరి నరేష్ పుట్టినరోజు  సందర్భంగా సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు ఈ సినిమా టీజర్ విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ఓ పోస్టర్ విడుదల చేస్తూ తెలిపింది. అయితే చూడాలి మరి ఈ సినిమా అయిన హిట్ అవుతుందా... లేదా అనేది.