మహేష్ 25 సినిమాలో అల్లరి నరేష్ క్యారెక్టర్ ఇదేనా..?

మహేష్ 25 సినిమాలో అల్లరి నరేష్ క్యారెక్టర్ ఇదేనా..?

మహేష్ 25 సినిమా షూటింగ్ డెహ్రాడూన్ లో జరుగుతున్నది.  మహేష్ 25 వ సినిమా కావడంతో దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి.  ఎలాగైనా హిట్ కొట్టాలనే తలంపుతో మహేష్ టీమ్ ఉన్నది.  అలాగే, 25 వ సినిమా కాబట్టి ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ సినిమా చేస్తున్నారు.  

ఇక ఇదిలా ఉంటె, ఈ సినిమాకు సంబంధించిన ఏదో  ఒక న్యూస్ మీడియాలో  ట్రెండ్ అవుతూనే ఉన్నది.  తాజాగా దీనికి సంబంధించిన మరో న్యూస్ బయటకు వచ్చింది.  అదేమంటే, మహేష్ బాబు ఇందులో ధనవంతుడుగా కనిపిస్తుంటే.. అల్లరి నరేష్ పేదవాడి పాత్రలో కనిపించబోతున్నారు. అంటే, శ్రీకృష్ణుడు, కుచేలునిలా అన్నమాట.  మొత్తానికైతే సినిమా అనుకున్నప్పటి నుంచి ఎదో ఒక న్యూస్ మీడియాలో ఉంచుతూ, ట్రెండ్ చేస్తున్నారు.  భారీ అంచనాలతో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే వచ్చే ఏడాది వరకు ఆగాల్సిందే.