55 సినిమాలు.. సంతృప్తిగా ఉన్నా : నరేష్

55 సినిమాలు.. సంతృప్తిగా ఉన్నా : నరేష్

'అల్లరి' సినిమాతో నటుడిగా పరిచయమైన అల్లరి నరేష్ మెల్లగా హీరోగా మారాడు.  ఎంటర్టైన్మెంట్ ప్రధానంగా సినిమాలు చేస్తూనే మధ్యలో 'నేను, గమ్యం, శంభో శివ శంభో' లాంటి ప్రయోగాత్మక చిత్రాల్ని చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు.  మొదటి సినిమాలో ఆయన పాత్ర పేరు రవి, అలాగే నిన్న విడుదలైన 'మహర్షి'లో కూడా అదే పేరు.  అందుకే  రవి17 ఏళ్ళ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నాడు.  ఈ పదిహేడేళ్లల్లో చేసియాన్ 55 సినిమాల ప్రయాణం నాకు సంతృప్తిగా ఉంది.  నన్ను ఆదరించిన ప్రేక్షకులకు, నమ్మిన దర్శకులకు, నిర్మాతలకు, సాంకేతిక నిపుణులకు ధన్యవాదాలు అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు నరేష్.