నాంది ఓటీటీ రిలీజ్ ఫిక్స్..?

నాంది ఓటీటీ రిలీజ్ ఫిక్స్..?

అల్లరి నరేష్ సరైన హిట్ కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు. ఈ ఎదురుచూపులకు నాంది సినిమా తెరదించింది. అల్లరి నరేష్ తన సినీ కెరీర్‌లో చెసిన పెద్ద ప్రయోగంగా కూడా నాంది సినిమాను చెప్పుకోవచ్చు. ఎప్పుడూ తాను చేసే కామెడీ జానర్‌ను పక్కన పెట్టి పూర్తి సీరియస్ పాత్రలో నరేష్ అలరించారు. ఈ సినిమాలో విలక్షణ నటి వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించారు. అయితే తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌ అనేక వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిందని టాక్ నడుస్తోంది. ఈ సినిమా అల్లరి నరేష్ వన్ మ్యాన్ షోగా నిలిచింది. ఈ సినిమా మార్చి 12 నుంచి ఓటీటీలోకి వస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు వీటికి సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ విషయంపై త్వరలో క్లారిటీ వస్తుందేమో వేచి చూడాలి.