శరవేగంగా అల్లరినరేష్ 'నాంది'.. తొలి షెడ్యూల్ పూర్తి

శరవేగంగా అల్లరినరేష్ 'నాంది'.. తొలి షెడ్యూల్ పూర్తి

అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'నాంది'. ఎస్‌వీ2 ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రూపొందుతున్నఈ సినిమాకు విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమాను 'శతమానంభవతి' ఫెమ్ సతీష్ వేగేశ్న నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో నరేష్ తన కామెడీ హీరోయిజానికి పూర్తి విభిన్నంగా కనిపించనున్నాడు. ఆ మధ్య ఈ సినిమాకు సంబందించిన టైటల్ పోస్టర్ ను విడుదల చేశారు చిత్రయూనిట్ . ఈ పోస్టర్ కు ప్రేక్షకులనుంచి మంచి స్పందన వస్తుంది.  

సామాజిక అంశాలు మేళవించిన థ్రిల్లర్‌ గా వస్తున్న ఈ సినిమాలో వరలక్ష్మి శరత్‌కుమార్‌ కీలక పాతర్లో కనిపించనున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే తొలి షెడ్యూల్ ను పూర్తిచేసుకుంది.  వీలైనంత త్వరగా షూటింగ్ ను పూర్తి చేసి వేసవి సెలవల్లో ఈ సినిమాను విడుదల చేయాలని చిత్రనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.