కోదండరామ్‌పై సంచలన ఆరోపణలు..

కోదండరామ్‌పై సంచలన ఆరోపణలు..

తెలంగాణ జనసమితి పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు పార్టీ ఉపాధ్యక్షురాలు రచనా రెడ్డి ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె పార్టీ అధ్యక్షుడు కోదండరామ్‌పై సంచలన ఆరోపణలు చేశారు. కోదండరామ్‌ కాంగ్రెస్‌తో అంతర్గత డీల్స్ కుదుర్చుకున్నారని ఆరోపించారు. ఆయనను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. 'నిన్ను నువ్వు చూసుకున్నావు. నిన్ను నమ్ముకుని వచ్చిన అభ్యర్థుల రాజకీయ భవిష్యత్తును నాశనం చేశావు' అని కోదండరామ్‌ను విమర్శించారు. జనసమితి పెట్టడానికి కారణాలు ఏమిటి? మీరు చెస్తుందేమిటి? అని ప్రశ్నించారు. 

కూటమిలో సామాజిక న్యాయం జరగలేదన్న ఆమె..  చాలా మంది అమాయకులను బలిపశువులను చేశారని అభిప్రాయపడ్డారు. కూటమిలో పొలిటికల్‌ బ్రోకర్స్‌ ఉన్నారని విమర్శించారు. పైసలు వసూలు చేసి కూటమి కట్టారని, మైనారిటీలకు ఒక్క సీటు కూడా ఇవ్వలేదని.. వంకాయలు, బీరకాయలు అమ్ముకున్నట్లు సీట్లు అమ్ముకున్నారని రచనా రెడ్డి ఆరోపించారు. ప్రజలు ఆలోచించి ఓటేయాలని సూచించిన ఆమె.. టీఆర్‌ఎస్‌కు కూటమి ప్రత్యామ్నాయం కాదన్నారు. టీజేఎస్‌-కాంగ్రెస్‌ల మధ్య నగదు బదిలీలు జరిగాయని మర్రి ఆదిత్యరెడ్డి ఆరోపించారు. తాను కూడా పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.