దంగల్ దర్శకుడితో అల్లు అరవింద్ భారీ సినిమా

దంగల్ దర్శకుడితో అల్లు అరవింద్ భారీ సినిమా

భారతీయులకు రామాయణ, మహాభారతాలు రెండు కళ్ళ లాంటివి.  ఈ రెండింటి ఆధారంగా ఇప్పటికే చాలామంది చాలా సినిమాలు తీశారు.  ఇప్పటికీ తీస్తూనే ఉన్నారు.  బ్లాక్ అండ్ వైట్ కాలంలో ఎందరో గొప్ప గొప్ప నటులు, దర్శకులు రామాయణం ఆధారంగా సినిమాలు చేశారు.  అప్పట్లో ఎపిక్ కధాంశాలతో సినిమాలు వరసగా వస్తుండేవి.  

కానీ, ఇప్పుడు వాటి జోలికి పోవడం లేదు.  అలాంటి సినిమాలు తీయాలి అంటే ఖర్చుతో కూడుకొని ఉంటుంది.  గ్రాఫిక్స్ ఎక్కువ ప్రాధానత్య ఇవ్వాలి.  అయితే, రామాయణ కావ్యాన్ని దృశ్యకావ్యంగా మలిచేందుకు నిర్మాతలు అల్లు అరవింద్, మధు మంతెన, నమిత్ మల్హోత్రాలు సిద్ధం అయ్యారు.  రామాయణాన్ని మూడు భాగాలుగా హిందీ, తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు.  3డి లో సినిమాను తెరకెక్కిస్తారట. దంగల్ దర్శకుడు నితీష్ తివారి, మామ్ దర్శకుడు ఉద్యావర్ లు దర్శకత్వం వహించబోతున్నారు.  ఫస్ట్ పార్ట్ 2021 లో రిలీజ్ కానున్నది.  ఇందులో ఎవరెవరు నటిస్తున్నారు అన్నది త్వరలోనే రివీల్ అవుతుంది.