ద‌త్ టీమ్‌కి అల్లూ కాస్ట్‌లీ పార్టీ

ద‌త్ టీమ్‌కి అల్లూ కాస్ట్‌లీ పార్టీ

`మ‌హాన‌టి` టీమ్ స‌క్సెస్ జోష్‌లో ఉంది. ఇంటా బ‌య‌టా ఈ సినిమా సాధిస్తున్న వసూళ్లు వైజ‌యంతి మూవీస్ టీమ్‌లో కొత్త క‌ళ తెచ్చాయి.  ఇదిగో నిన్న‌టి సాయంత్రం అల్లూ వారు ఇచ్చిన పార్టీలో `మ‌హాన‌టి` టీమ్ ఇలా సెల‌బ్రేష‌న్ మోడ్‌లో క‌నిపించింది. స‌క్సెస్ ఎవ‌రి మోములో అయినా చంద‌మామ గ్లింప్స్ క‌నిపించేలా చేస్తుంది. ద‌త్‌& టీమ్‌ని చూస్తే అది ప‌క్కాగా క‌నిపిస్తోంది. పార్టీలో బాస్ అల్లు అర‌వింద్‌, అల్లు అర్జున్‌, ఎం.ఎం.కీర‌వాణి, ది గ్రేట్ ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి చిలౌట్ మూడ్‌లో క‌నిపిస్తున్నారు.

బ‌న్ని స్వ‌యంగా ఈ ఫోటోని సామాజిక మాధ్య‌మంలో షేర్ చేసి ఆస‌క్తిక‌ర వ్యాఖ్యానం చేశారు. ``మ‌హాన‌టి` స‌క్సెస్ వేళ‌.. నాన్న‌(అర‌వింద్‌)గారు... ఆయ‌న స్నేహితుడు కం వ్యాపార భాగ‌స్వామి అశ్వ‌నిద‌త్‌కి అద్భుత‌మైన పార్టీ ఇచ్చారు. మ‌హాన‌టి టీమ్‌కి, కెప్టెన్‌ నాగ్ అశ్విన్‌కి హ్యాట్సాఫ్‌`` అని పోస్ట్ చేశారు. స్నేహితుడి విజ‌యాన్ని బాస్ అర‌వింద్ కాస్ట్‌లీగానే సెల‌బ్రేట్ చేశార‌ని ఇదిగో ఈ వేదిక చెబుతోంది. ఇదివ‌ర‌కూ మెగాస్టార్ చిరంజీవి ద‌త్ టీమ్‌ని ప్ర‌శంసించి, స‌న్మానించిన సంగ‌తి తెలిసిందే.