అల్లు అర్జున్ ఇది నిజమా..!!??

అల్లు అర్జున్ ఇది నిజమా..!!??

నాపేరు సూర్య.. సినిమా తరువాత అల్లు అర్జున్ సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.  కథ, కథనాలు విని నచ్చితేనే ప్రొసీడ్ అవుతున్నాడు.  అందుకే త్రివిక్రమ్ సినిమా కూడా ఆలస్యం అయ్యింది.  త్రివిక్రమ్ తో చేయబోతున్న సినిమా రీసెంట్ గా ప్రారంభం అయ్యింది.  దీని తరువాత సుకుమార్, ఆ తరువాత వేణు శ్రీరామ్ తో సినిమా చేయాలి.  

వేణు శ్రీరామ్ తో చేయబోయే సినిమా టైటిల్ అప్పుడే ఎనౌన్స్ చేశారు.  ఐకాన్.. కంటబడటం లేదు.  ఈ టైటిల్ ను బట్టి చూస్తే.. ఇది ఫిలిప్పీన్స్ లో రెండేళ్ల క్రితం వచ్చిన కిటకిట సినిమా కాన్సెప్ట్ లా ఉంది.  ఆ సినిమాలో హీరో హీరోయిన్లు అనుకోకుండా కలవడం అదే సమయంలో హీరోయిన్ తన కళ్ళను తాత్కాలికంగా కోల్పోవడంతో... ఆమెకు హీరో తోడుగా ఉండి జర్నీ చేస్తాడు.  సెంటిమెంట్ డ్రామా ఎక్కువగా ఉన్న ఫిలిప్పీన్స్ సినిమా ఆకట్టుకుంది.  మరి వేణు శ్రీరామ్ ఆ కథను మన నేటివిటీకి తగ్గట్టుగా ఎలా మలుచుకొని రాసుకున్నాడో చూడాలి.  అసలు ఐకాన్ కథను అక్కడి నుంచే తీసుకున్నారా లేదంటే సొంత కథేనా కూడా తెలియాల్సి ఉంది.