పుట్టిన రోజున ఐకాన్ గా సందడి చేస్తున్న బన్నీ

పుట్టిన రోజున ఐకాన్ గా సందడి చేస్తున్న బన్నీ

అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా బన్నీ అప్ కమింగ్ సినిమాల గురించిన న్యూస్ వరసగా ప్రకటించారు.  తన 19 వ సినిమాను త్రివిక్రమ్ తో చేస్తున్న సంగతి తెలిసిందే.  ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్స్ లో ఉన్న ఈ సినిమా ఏప్రిల్ నెలాఖరు నుంచి సెట్స్ మీదకు వెళ్ళబోతున్నది.  దీని తరువాత ఆగష్టు నుంచి సుకుమార్ సినిమా స్టార్ట్ అవుతుంది.  మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది.  ఇందులో గీత గోవిందం హీరోయిన్ రష్మిక ను తీసుకున్నారని సమాచారం.  

ఇదిలా ఉంటె, అల్లు అర్జున్ 21 వ సినిమాను కూడా ఈరోజు అనౌన్స్ చేశారు.  ఓ మై ఫ్రెండ్, ఎంసిఏ వంటి సినిమాలు దర్శకత్వం వహించిన వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో సినిమా తెరకెక్కబోతున్నది.  ఈ సినిమాకు ఐకాన్... కనుబడుటలేదు అనే టాగ్ లైన్ తో కూడిన టైటిల్ ను ప్రకటించారు.  త్రివిక్రమ్, సుకుమార్ ల సినిమాలు పూర్తయ్యాక ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది.