అల్లు అర్జున్ ఏఏ 19 సినిమా టైటిల్ ఇదేనా..?

అల్లు అర్జున్ ఏఏ 19 సినిమా టైటిల్ ఇదేనా..?

అల్లు అర్జున్ కొత్త సినిమా ఏ ఏ 19 సినిమా షూటింగ్ వేగంగా జరుగుతున్నది.  త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీపై అనేక అంచనాలు ఉన్నాయి.  ఫాదర్ సెంటిమెంట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కాబోతున్నది.  

సినిమా టైటిల్స్ విషయంలో త్రివిక్రమ్ చాలా కొత్తగా ఆలోచిస్తారు.  అచ్చతెలుగు పేర్లు సినిమా టైటిల్స్ గా పెట్టడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు.  అల్లు అర్జున్ కొత్త సినిమాకు ఎలాంటి టైటిల్ పెట్టబోతున్నారు అనే దానిపై అనేక విషయాలు బయటకు వస్తున్నాయి.  

అందులో కొన్ని టైటిల్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అలాంటి టైటిల్స్ లో ఒకటి అలకనంద, రెండో పేరు నాన్న.. నేను.  ఈ రెండు పేర్లలో ఒకటి సినిమాకు ఫైనల్ చేస్తారని తెలుస్తోంది.  రెండు పేర్లు కూడా చాలా బాగున్నాయని ఇప్పటికే సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నది.