ఓ బేబీ పై అల్లు అర్జున్ కామెంట్స్..!!

ఓ బేబీ పై అల్లు అర్జున్ కామెంట్స్..!!

సమంత ఓ బేబీ మూవీ సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది.  మంచి వసూళ్లు సాధిస్తూ దూసుకుపోతున్న ఈ మూవీపై సెలెబ్రిటీ పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నరు.  ఓ బేబీలో సమంత నటన సూపర్ అని, ప్రతి క్యారెక్టర్ ను అద్భుతంగా డిజైన్ చేశారని వార్తలు వచ్చాయి.  ఇలా మెచ్చుకునే వాళ్లలో అల్లు అర్జున్ కూడా చేరిపోయారు.  

అల్లు అర్జున్ ఓ బేబీ పై ప్రశంసల వర్షం కురిపించారు. సమంత నటనతో కట్టిపడేసిందని, నందిని రెడ్డి మరోమారు తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుందని చెప్పారు.  అల్లు అర్జున్ కామెంట్స్ పై నందిని రెడ్డి స్పందించింది.  పాజిటివ్ గా రెస్పాండ్ అయినందుకు ఆమె థాంక్స్ చెప్పింది.