గ్లింపేజ్ అదిరింది...టీజర్ ఎలా ఉంటుందో ?

గ్లింపేజ్ అదిరింది...టీజర్ ఎలా ఉంటుందో ?

అల్లు అర్జున్ హీరోగా చేస్తున్న సినిమా ఆలా వైకుంఠపురంలో ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  ఈ మూవీ వచ్చే ఏడాది జనవరి 12 వ తేదీన రిలీజ్ కాబోతున్నది.  త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో అన్ని రకాల హంగులు ఉండబోతున్నాయి.  కామెడీ, లవ్, సెంటిమెంట్ ఇలా అన్ని రకాలకు ఈ సినిమాలో కనిపించబోతున్నాయి.  ఇక, ఇదిలా ఉంటె, ఈ సినిమాకు సంబంధించిన గ్లింపేజ్ కొద్దిసేపటి క్రితమే రిలీజ్ అయింది. 

బన్నీ వెనక్కి తిరిగి ఉండి రెడ్ కలర్ కోట్ వేసుకోవడం... బెంచ్ మీద నడవటం వంటివి చూపించారు.  బన్నీ నడుస్తున్నప్పుడు.. కుర్చీల్లో కూర్చున్న వ్యక్తులు అదోలా చూడటంతో గ్లింపేజ్ పూర్తయింది.  దీన్ని బట్టి టీజర్ లో ఎలాంటి టార్చర్ ను చూపించబోతున్నారో తెలుస్తోంది.  పూజా హెగ్డే హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమాకు త్రివిక్రమ్ దర్శకుడు.  డిసెంబర్ 11 వ తేదీ సాయంత్రం 4:05 గంటలకు టీజర్ రిలీజ్ చేయబోతున్నారు.  ఈ టీజర్ కోసం ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తున్నారు.