దసరాకు బన్నీ స్పెషల్ ట్రీట్..!!

దసరాకు బన్నీ స్పెషల్ ట్రీట్..!!

అల్లు అర్జున్...త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా అల వైకుంఠపురంలో.  ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతున్నది.  వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా రిలీజ్ కాబోతున్నది.  సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఫాదర్ సెంటిమెంట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ ను మొదట త్రివిక్రమ్ పుట్టినరోజున రిలీజ్ చేయాలని అనుకున్నట్టు వార్తలు వచ్చాయి.  

అయితే, టీజర్ త్రివిక్రమ్ పుట్టినరోజున కాకుండా.. దసరా రోజున రిలీజ్ చేయాలని అనుకుంటున్నారని టాక్.  టీజర్ రిలీజ్ చేయడానికి దసరా కంటే మంచి సమయం లేదని, ఆరోజున రిలీజ్ చేస్తే అన్నివిధాలుగా బాగుంటుందని అనుకుంటున్నారట.  ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది.  పూజా హెగ్డే హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమాలో టబు కీలక పాత్ర పోషిస్తోంది.