బన్ని అలా కనిపించడం వెనుక అసలు రహస్యం ఇదే 

బన్ని అలా కనిపించడం వెనుక అసలు రహస్యం ఇదే 

అల్లు అర్జున్ హీరోగా చేస్తున్న సినిమా అల వైకుంఠపురంలో... ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 12 వ తేదీన రిలీజ్ కాబోతున్నది.  సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.  ఈ మూవీకి సంబంధించిన టీజర్ ఇటీవలే రిలీజ్ అయ్యింది.  ఇందులో బన్నీ కొన్ని సీన్స్ లో డీ గ్లామర్ గా కనిపించబోతున్నారు.  కష్టపడి పనిచేసే మధ్యతరగతి కుర్రోడి పాత్రలో బన్నీ కనిపిస్తున్నారు.  

కష్టపడి పనిచేస్తాడు కాబట్టి దానికి తగ్గట్టుగా మేకప్ ఉండాలి.  అందుకోసమే డార్క్ స్కిన్ కలర్ మేకప్ వాడుతున్నారట.  ఆయిలీగా ఉండే మేకప్ తో బన్నీకి మేకప్ చేశారు.  ఈ మేకప్ సినిమాకు హైలైట్ గా మారబోతున్నాడు.  గతంలో రజినీకాంత్, కమల్ హాసన్ లు ఎక్కువగా ఇలా డీగ్లామర్ పాత్రలు చేశారు.  అదే విధంగా స్వయంకృషి సినిమాలో మెగాస్టార్ కూడా ఇలానే కనిపించారు.  అదే విధంగా బాలీవుడ్ లో రణ్వీర్ సింగ్ గల్లీ బాయ్ సినిమాలో ఇలానే కనిపించి మెప్పించాడు.