ట్రెండ్ కు రెడీ అవుతున్న అల్లు అర్జున్ ఫ్యాన్స్

ట్రెండ్ కు రెడీ అవుతున్న అల్లు అర్జున్ ఫ్యాన్స్

గత ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 12న 'అల వైకుంఠపురములో' సినిమా విడుదలైంది. స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో రూపొందిన హ్యాట్రిక్‌ మూవీ ఇది. ఈ సినిమా విడుదలకు ముందే పాటలు సోషల్‌ మీడియాలో ఎంత పెద్ద సెన్సేషనల్‌ హిట్‌ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ చిత్రానికి త‌మ‌న్ అందించిన సంగీతం చాలా ప్ల‌స్ అయింది అని చెప్ప‌డంలో ఎలాంటి అతిశ‌యోక్తి లేదు. తండ్రీ కొడుకుల మధ్య ప్రేమ, అనురాగాన్ని తనదైన శైలిలో మాటల మాంత్రికుడు తెరకెక్కించిన తీరుకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌, గీతాఆర్ట్స్‌ బ్యానర్స్‌పై అల్లు అరవింద్‌, ఎస్‌.రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే ఈ సినిమా జనవరి 12తో ఏడాది పూర్తి చేసుకుంటున్న సంద‌ర్భంగా ఆ రోజు గ్రాండ్ సెల‌బ్రేష‌న్స్ జ‌ర‌పాల‌ని చిత్రబృందం భావిస్తోందట. అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా జనవరి 12 ట్విట్టర్ ట్రేడింగ్ కు అలర్ట్ అవుతున్నారు. కాగా 'అల వైకుంఠపురములో' సినిమా రూ.260 కోట్లపైగా వసూళ్లను ఈ చిత్రం రాబ‌ట్టిందే ఈ చిత్ర ప్ర‌భంజనం ఏ విధంగా సాగిందో అర్దం చేసుకోవ‌చ్చు.