'పుష్ప' డిసెంబర్ కి వెళుతున్నాడా!?

'పుష్ప' డిసెంబర్ కి వెళుతున్నాడా!?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం 'పుష్ప'. తెలుగు, మలయాళ, తమిళ, కన్నడ, హిందీ బాషల్లో భారీ స్థాయిలో ప్యాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. లేటెస్ట్ గా వచ్చిన టీజర్ తో ఆ అంచనాలు రెట్టింపు అయ్యాయి. రశ్మిక హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో జగపతిబాబు, ప్రకాశ్ రాజ్, సునీల్, ధనుంజయ్ ముఖ్యపాత్రధారులు. ఇక ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో పహాద్ ఫాజిల్ మెయిన్ విలన్ గా నటిస్తుండటం విశేషం. ఇదిలా ఉంటే ఈ సినిమాను ఆగస్ట్ 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. అయితే కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఆగస్ట్ రేస్ నుంచి డిసెంబర్ కు షిఫ్ట్ అయిందనే టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై ఎలాంటి క్లారిటీ లేదు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ఈ పుకారు నిజమో కాదో తెలియాల్సి ఉంది.