బన్నీ ఫ్యాన్స్ కు అదిరిపోయే న్యూస్..!!

బన్నీ ఫ్యాన్స్ కు అదిరిపోయే న్యూస్..!!

అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. టైటిల్ ఇంకా అనౌన్స్ చేయలేదు.  స్వాతంత్ర దినోత్సవం రోజున బన్నీ 19 వ సినిమా టైటిల్ అనౌన్స్ చేస్తారని సమాచారం.  ఇప్పటికే షూటింగ్ చాలావరకు పూర్తయింది. వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కాబోతున్నది.  అయితే, నెక్స్ట్ సినిమా ఎవరితో అనే దానిపై నిన్నటి వరకు ఓ క్లారిటీ లేదు.  

సడెన్ గా బన్నీ తన కొత్త సినిమా గురించిన న్యూస్ ను ప్రకటించారు.  నెక్స్ట్ సినిమా సుకుమార్ తో చేస్తున్నట్టు చెప్పేశారు.  సుకుమార్ చెప్పిన స్టోరీ బాగా నచ్చడంతో సెట్స్ మీదకు తీసుకెళ్లాలి కోరారట. వచ్చే నెల నుంచి సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతున్నది.  ఇందులో రష్మిక హీరోయిన్.  దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు.  ఇందులో నటించే మిగతా నటీనటుల వివరాలు త్వరలోనే వెల్లడిస్తారట.