అల్లు అర్జున్ కు ఆ సినిమా ఎంతగా నచ్చిందటే..!!

అల్లు అర్జున్ కు ఆ సినిమా ఎంతగా నచ్చిందటే..!!

టాలీవుడ్లో హీరోల మధ్య ఫ్రెండ్లీ నేచర్ ఉన్న సంగతి తెలిసిందే.  ఒకరి సినిమాలను మరొకరు మెచ్చుకుంటూ ప్రమోషన్ చేసుకుంటూ.. సినిమా ఇండస్ట్రీ అభివృద్ధిలో తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటె, ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఓ ట్రెండ్ నడుస్తున్నది.  సస్పెన్స్ సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు.  థ్రిల్లింగ్ ఇచ్చే ట్విస్ట్ లు సినిమాలో ఉంటె చాలు.  సినిమా మినిమమ్ గ్యారెంటీ.  

క్షణం, గూఢచారి సినిమాలు ఇలా థ్రిల్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన సినిమాలే.  ఈ రెండు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి.  ఇప్పుడు అడవి శేషు ఎవరుగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మెప్పించాడు.  ఈ సినిమా సామాన్య ప్రేక్షకులతో పాటు సెలెబ్రిటీలు కూడా చూస్తున్నారు.. మెచ్చుకుంటున్నారు.  ఈ సినిమాను చూసిన వాళ్లలో అల్లు అర్జున్ కూడా ఉన్నారు.  సినిమా చాలా బాగా నచ్చిందని, ట్విస్ట్ లు బాగున్నాయని బన్నీ అన్నారు.  సినిమాలో నటించిన నటీనటులకు, టెక్నిషియన్స్ కు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు.  బన్నీ చేసిన ఈ ట్వీట్ ఎవరు సినిమాకు మంచి బూస్ట్ ఇస్తుంది అనడంలో సందేహం అవసరంలేదు.