ఆర్య..సయేషా సంగీత్ లో అల్లు అర్జున్ సందడి..!!

ఆర్య..సయేషా సంగీత్ లో అల్లు అర్జున్ సందడి..!!

ఆర్య.. సయేషా సంగీత్ వేడుక అంగరంగ వైభవంగా సాగింది.  ఈ వేడుకకు అతి తక్కువమంది మాత్రమే హాజరయ్యారు.  ఇలా హాజరైన ముఖ్యమైన అతిధుల్లో అల్లు అర్జున్ ఒకరు.  అల్లు అర్జున్.. ఆర్యలు మంచి స్నేహితులు.  ఇద్దరు కలిసి తెలుగులో వరుడు సినిమా చేశారు.  ఆ సినిమా హిట్ కాలేకపోయినా.. అప్పటి నుంచి ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. 

గజినీకాంత్ సినిమా సమయంలో ఇద్దరు ప్రేమలో పడ్డారు.  అలా ఇద్దరి మధ్య ఏర్పడిన ప్రేమ.. వివాహం వైపు నడిపించింది.  ప్రస్తుతం సాయేషా కోలీవుడ్ లో కొన్ని సినిమాలు చేసింది.  ప్రస్తుతం సూర్య హీరోగా చేస్తున్న కాప్పన్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.  ఆర్య కూడా కాప్పన్ సినిమాలో ఓ కీలకమైన రోల్ చేస్తున్నాడు.