బన్నీ డ్యాన్స్.. నాని సాంగ్.. సోషల్ మీడియాలో వైరల్..!!

బన్నీ డ్యాన్స్.. నాని సాంగ్.. సోషల్ మీడియాలో వైరల్..!!

అల్లు అర్జున్, నాని లు స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తుంటారు.  ఎక్కడ ఉన్నా సరే వారి స్నేహితుల వివాహాలకు, వారి ఇంట్లో జరిగే వేడుకలకు హాజరవుతుంటారు.  ఇలాంటి సంఘటనే ఒకటి జరిగింది.  అల్లు అర్జున్, నానీల కామన్ ఫ్రెండ్ వివాహానికి ఈ ఇరువురు సతీసమేతంగా హాజరయ్యారు.  హాజరవ్వడమే కాదు.. నాని పాటలు పాడుతుంటే బన్నీ డ్యాన్స్ కూడా చేశారట.  

ఆర్య 2 సినిమాలో ఉప్పెనంత ఈ ప్రేమకి అనే సాంగ్ ప్లే అవుతుంటే.. అల్లు అర్జున్ తన సతీమణి స్నేహారెడ్డితో కలిసి స్టెప్పులు వేశాడు.  నినుకోరి సినిమాలోని అడిగా అడిగా సాంగ్ ను నాని పడుతుంటే ఆయన సతీమణి స్టెప్పులు వేసింది.  బన్నీ, నానీలు కలిసి ఎటో వెళ్ళిపోయింది మనసు.. ప్రియతమా నీవచట కుశలమా.. అనే సాంగ్స్ పాడుతూ అక్కడ ఉన్నవారిని ఉత్సాహ పరిచారు.  ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.