అల్లు అర్జున్ చేస్తున్నది సాహసమే !

అల్లు అర్జున్ చేస్తున్నది సాహసమే !

ఏ స్టార్ హీరో అయినా భారీ పరాజయం తరవాత వరుసగా రెండు మూడు హిట్లు కొట్టాలని అనుకుంటాడు.  అందుకు అనుగుణంగానే సినిమాలు ప్లాన్ చేసుకుంటాడు.  కానీ బన్నీ మాత్రం అందుకు భిన్నం.  నెస్ట్ రెండు సినిమాలను త్రివిక్రమ్, సుకుమార్ లాంటి స్టార్ డైరెక్టర్లతోనే చేస్తున్నా ఆ తర్వాతి సినిమాను మాత్రం వేణు శ్రీరామ్ డైరెక్షన్లో చేస్తున్నాడట.  'ఓమై ఫ్రెండ్' తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకుని ఈమధ్యే 'ఎంసిఏ'తో పర్వాలేదనిపించుకున్నాడు వేణు శ్రీరామ్.  అతను చెప్పిన లైన్ నచ్చడంతో బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.  ఒకరకంగా ఇది సాహసమే అనాలి.  ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తారని సమాచారం.