హ్యాపీ హ్యాపీగా అల్లు అర్జున్ !

హ్యాపీ హ్యాపీగా అల్లు అర్జున్ !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నుండి సినిమా వచ్చి చాలా రోజులే అయింది.  ఏడాది క్రితం 'నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా'తో ప్రేక్షకుల్ని పలకరించిన ఆయన కొత్తగా మూడు సినిమాలకు సైన్   చేశాడు.  ఇన్నిరోజులు కథలు వినడం, కొత్త ప్రాజెక్ట్స్ సెట్ చేసుకోవడంలో బిజీ అయిన ఆయన ప్రస్తుతం కుటుంబంతో విహారానికి వెళ్లారు. 

భార్య, ఇద్దరు పిలల్లతో కలిసి స్విట్జర్లాండ్లో హాలీడే ఎంజాయ్ చేస్తున్నారు.  అక్కడి ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు.  ఇకపోతే సైన్ చేసిన మూడు సినిమాల్లో మొదట త్రివిక్రమ్ చిత్రాన్ని చేయనున్న బన్నీ ఆ తరవాత సుకుమార్ ప్రాజెక్ట్ అనంతరం వేణు శ్రీరామ్ 'ఐకాన్' సినిమాను చేయనున్నారు.