రామ్ చరణ్ ను టార్గెట్ చేసిన బన్నీ ఫ్యాన్స్

రామ్ చరణ్ ను టార్గెట్ చేసిన బన్నీ ఫ్యాన్స్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పై బన్నీ ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఒకరి పై ఒకరు విమర్శలు కు దిగుతున్నారు. దానికి కారణం ఏంటంటే రామ్ చరణ్ అల్లు అర్జున్ సినిమా పై ప్రశంసలు కురిపించక పోవడమే. త్రివిక్రమ్ దర్శకత్వం లో బన్నీ నటించిన 'అల వైకుంఠపురం లో' సినిమా ఇటీవల విడుదలై బ్రహ్మాండమైన విజయం సాధించింది. అయితే ఈ సినిమా విజయం సాధించిన సందర్భంగా ఇండస్ట్రీ పెద్దలందరూ 'అల' టీమ్ పై ప్రశంసలు కురిపించారు. ఒక్క రామ్ చరణ్ తప్ప. 

దాంతో బన్నీ ఫ్యాన్స్ చరణ్ పై ఫైర్ అవుతున్నారు. అప్పుడెప్పుడో రిలీజ్ అయిన సమయంలో చరణ్ విష్ చేసాడు మళ్ళీ ఆ ఊసే లేదు. అయితే ఇటీవల సమంత, శర్వానంద్ నటించిన 'జాను' సినిమా విజయం సాధించిన తర్వాత  చరణ్ చిత్రయూనిట్ పై పొగడ్తల వర్షం కురిపించాడు. పెద్ద సినిమాను పట్టించుకోకుండా చిన్న సినిమాను పొగడడం పై బన్నీ ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ కారణంగా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ మధ్య వార్ నడుస్తుంది.