అప్పుడే అల్లు అర్జున్ మొదలుపెట్టాడా..?

అప్పుడే అల్లు అర్జున్ మొదలుపెట్టాడా..?

అల్లు అర్జున్ 20 వ సినిమా ఐకాన్.  ప్రస్తుతం త్రివిక్రమ్ తో 19 సినిమా చేస్తున్నాడు.  ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్స్ లో ఉంది.  ఈనెల 24 వ తేదీ నుంచి సెట్స్ మీదకు వెళ్ళబోతున్న సంగతి తెలిసిందే.  దీని తరువాత ఐకాన్ చేస్తున్నాడు.  ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ ను అల్లు అర్జున్ అప్పుడే మొదలుపెట్టినట్టున్నాడు.  అదెలా అని అనుకుంటున్నారా..?

అల్లు అర్జున్ రీసెంట్ గా ఓటు వేసేందుకు వెళ్లిన సమయంలో తలపై ఉన్న టోపీని దాదాపుగా ఎవరూ గుర్తించి ఉండరు.  ఎందుకంటే.. ఎన్నికల హడావుడిలో అందరు ఓటు వేసేందుకు వచ్చారు అని చూస్తారుగాని యాక్ససరీస్ ను పెద్దగా పట్టించుకోరు.  అల్లు అర్జున్ తలపై ఉన్న టోపీ మీద ఐకాన్ అని రాసుంది.  కాకతాళీయంగా ఆ టోపీ పెట్టుకొని వచ్చారో లేదంటే కనుక కావాలని ఆలా వచ్చారో తెలియదుగాని, ఐకాన్ క్యాప్ మాత్రం సోషల్ మీడియాలో హైలైట్ అయ్యింది.