‘పుష్ప’ రాజ్ టీజర్‌.. ‘తగ్గేదే లే’

‘పుష్ప’ రాజ్ టీజర్‌.. ‘తగ్గేదే లే’

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో మైత్రీ మూవీస్, ముత్తంశెట్టి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’. రష్మిక మందన కథానాయికగా నటిస్తుండగా.. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే  విడుదలైన పోస్టర్స్‏తో ఆకట్టుకున్న ‘పుష్ప’ రాజ్.. తాజాగా విడుదలైన టీజర్ లోను ఊరమాస్ గెటప్‌లో సరికొత్తగా కనిపిస్తున్నాడు. ఏప్రిల్‌ 8న అల్లు అర్జున్‌ బర్త్ డే సందర్బంగా ఒకరోజు ముందుగానే అభిమానుల కోసం టీజర్‌ను విడుదల చేశారు. ఇక టీజర్‌లో అల్లు అర్జున్ యాక్షన్ సీన్స్ తో  పాటుగా నిర్మాణ విలువలు బాగున్నాయి. మరి ముఖ్యంగా పుష్పరాజ్ లుక్ టీజర్ లో ఆకట్టుకోగా.. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. ఇక అల్లు అర్జున్ మొదటి నుంచి చెప్పుతున్నట్లుగానే ‘తగ్గేదే లే’ డైలాగ్ ఆకట్టుకుంది. టీజర్ అంతా గంధపు చెక్కల స్మగ్లింగ్ చేయడం.. వాళ్లను పట్టుకోడానికి ఫారెస్ట్ ఆఫీసర్స్ వెంట పడటం చుట్టూ తిరగ్గా.. మెరుపు తీగలా రష్మిక మందన టీజర్ మధ్యలో మెరిసింది. ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ఆగస్టు 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.