ఏడాదిలో మూడు సినిమాలతో అల్లు అర్జున్ !

ఏడాదిలో మూడు సినిమాలతో అల్లు అర్జున్ !

ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న అల్లు అర్జున్ ఈ నెల 11వ తేదీన సుకుమార్ చిత్రాన్ని స్టార్ట్ చేయనున్నాడు.  ఈ రెండు చిత్రమా షూటింగ్ ఒకేసారి జరగనుంది.  ఈ రెండూ పూర్తయ్యాక వేణు శ్రీరామ్ డైరెక్షన్లో 'ఐకాన్' అనే సినిమాను మొదలుపెట్టనున్నాడు అల్లు అర్జున్.  అంటే ఏడాది కాలంలో వరుసగా మూడు సినిమాలతో సందడి చేయనున్నాడన్నమాట స్టైలిష్ స్టార్.  చాలా కాలం పాటు అనేక కథలు విన్న బన్నీ చాలా నమ్మకంతో ఈ మూడు సినిమాలని ఫైనల్ చేసుకున్నాడు.