బన్నీ అలా ఫిక్స్ అయ్యాడు..

బన్నీ అలా ఫిక్స్ అయ్యాడు..

అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.  ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ఇప్పటికే పూర్తి కావొచ్చింది. వచ్చే వారం నుంచి గ్యాప్ లేకుండా షూటింగ్ చేయాలని యూనిట్ నిర్ణయించింది.  సెంటిమెంట్ ప్రధానాంశంగా సినిమాను తెరకెక్కిస్తున్నారు త్రివిక్రమ్.  జులాయి.. సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు సూపర్ హిట్ కావడంతో అందరి దృష్టి ఈ సినిమాపై పడింది.  

డిజె సినిమాతో మంచి హిట్ రావడంతో పూజాకు బ్రేక్ వచ్చింది.  ఆ తరువాత ఆమె వరసగా టాప్ హీరోలతో సినిమాలు చేస్తూ వెళ్తున్నది.  ఇప్పుడు మరలా బన్నీతో మరోసారి నటించేందుకు సిద్ధం అయ్యింది.  ఈ సినిమాను మొదట దసరాకు తీసుకురావాలని అనుకున్నా... సైరా సినిమా ఉండటంతో సంక్రాంతికి రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు.  ఫాదర్ సెంటిమెంట్ ప్రధానాంశంగా ఈ సినిమా తెరకెక్కుతోంది.  గీతా ఆర్ట్స్, హారికా అండ్ హాసిని సంస్థలు నిర్మిస్తున్నాయి.