స్టైలిష్ లుక్ లో మెరిసిన అల్లుఅర్జున్ , స్నేహ

స్టైలిష్ లుక్ లో మెరిసిన అల్లుఅర్జున్ , స్నేహ

మెగా డాటర్‌ నిహారిక- జొన్నలగడ్డ చైతన్యల నిశ్చితార్థం గురువారం ఘనంగా జరిగింది. హైదరాబాద్‌లో జరిగిన వేడుకలకు ఇరు కుటుంబాలతో పాటుగా.. అతికొద్ది మంది సన్నిహితులు హాజరయ్యారు. మెగాఫ్యామిలీ మొత్తం ఈ వేడుకలో సందడి చేసింది.నిశ్చితార్థ వేడుకలో బన్ని కనిపించిన తీరు చూస్తుంటే `సూపర్ స్టైలిష్` అన్న అనకుండా ఉండలేం .. . బన్ని టాప్ టు బాటమ్ బ్లాక్ అండ్ బ్లాక్ లో కనిపించాడు.  గడ్డం మెలి తిప్పిన మీసకట్టు.. గిరజాల జుత్తుతో స్పెషల్ గా కనిపించడం ఒకెత్తు అయితే ఎంతో స్లిమ్ లుక్ కి మారిపోయి సూపర్ స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. ఇది నిజంగానే అభిమానులకు సర్ ప్రైజ్ ట్రీట్ అనే చెప్పాలి. కాగా, కరోనా ఎఫెక్ట్ తగ్గిన తర్వాత సుకుమార్ దర్శకత్వంలో బన్నీ పుష్ప అనే సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన లుక్ ఇప్పటికే విడుదల కాగా, ఇందులో బన్నీ లుక్ సినిమాపై భారీ అంచనాలు పెంచింది.