క్రేజీ కాంబినేషన్ సెట్ చేసుకున్న అల్లు అర్జున్ !

క్రేజీ కాంబినేషన్ సెట్ చేసుకున్న అల్లు అర్జున్ !

అల్లు అర్జున్ తన 20వ చిత్రాన్ని ప్రకటించాడు.  ఈ సినిమాను సుకుమార్ డైరెక్ట్ చేయనున్నాడు.  సుకుమార్ గతంలో బన్నీతో కలిసి 'ఆర్య, ఆర్య 2' సినిమాలు చేశాడు.  వీటిలో ఆర్య 2 పర్వాలేదనిపించుకోగా ఆర్య మాత్రం కొత్త ట్రెండ్ సెట్ చేసింది.  ఆ సినిమాతోనే బన్నీకి స్టార్ ఇమేజ్ మొదలైంది.  మళ్ళీ ఈ ఇద్దరూ ముచ్చటగా మూడవ సినిమా చేసేందుకు సిద్ధమయ్యారు.  ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.  మరి ఈసారి కూడా ఈ ఇద్దరూ ప్రేమ కథే చేస్తారో లేకపోతే వేరే ఏదైనా కొత్త జానర్ ట్రై చేస్తారో చూద్దాం.