బాలీవుడ్ ఎంట్రీపై బన్నీ క్లియర్ !

బాలీవుడ్ ఎంట్రీపై బన్నీ క్లియర్ !

 

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ త్వరలో బాలీవుడ్ పరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వనున్నారని గత రెండు మూడేళ్ళుగా వార్తలు వస్తూనే ఉన్నాయి.  కానీ ఇప్పటికీ ఆ పని జరగలేదు.  అందుకు కారణం బన్నీ కొద్దిగా కన్ఫ్యూజన్లో ఉండటమే.  ప్రస్తుతం ఆ డైలమా పోయిందట.  హిందీ సినిమాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారట.  ఎవరైనా దర్శకుడు మంచి కథ తీసుకొస్తే వెంటనే సైన్ చేయాలని చూస్తున్నాడట బన్నీ.  ఇకపోతే ప్రసుతం త్రివిక్రమ్ డైరెక్షన్లో సినిమా చేస్తున్న ఆయన ఆ తరవాత సుకుమార్, వేణు శ్రీరామ్ ప్రాజెక్ట్స్ సైన్ చేసి ఉన్నారు.