సామజవరగమన... ఫుల్ వీడియో సాంగ్... ఫ్యాన్స్ దిల్ ఖుష్..

సామజవరగమన... ఫుల్ వీడియో సాంగ్... ఫ్యాన్స్ దిల్ ఖుష్..

అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో సినిమా సంక్రాంతికి రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది.  నాన్ బాహుబలి రికార్డులను సొంతం చేసుకున్న ఈ సినిమాలోని సామజవరగమన సాంగ్ ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో చెప్పక్కర్లేదు.  ఆడియో సాంగ్ ఇప్పటి వరకు దాదాపుగా 200 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుంది.  కాగా, ఇప్పుడు దీనికి సంబంధించిన ఫుల్ సాంగ్ ను రిలీజ్ చేశారు.  

ఈ సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ కావడం మొదలుపెట్టింది.  ప్యారిస్ అందాలను సాంగ్ అద్భుతంగా చూపించారు.  ఇప్పటి వరకు థియేటర్లో సంచలనం సృష్టించిన ఈ సాంగ్, ఇప్పుడు యూట్యూబ్ ను షేక్ చేస్తున్నది.  అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా నటించిన ఈ సినిమాకు త్రివిక్రమ్ దర్శకత్వం వహించారు.  థమన్ అందించిన మ్యూజిక్ ఏ స్థాయిలో ఉన్నదో అర్ధం చేసుకోవచ్చు.