2020 మర్చిపోలేని తీపి జ్ఞాపకం: అల్లు అర్జున్

2020 మర్చిపోలేని తీపి జ్ఞాపకం: అల్లు అర్జున్

'అల వైకుంఠపురములో..' విడుదలై ఏడాది పూర్తయిన సందర్భంగా చిత్రయూనిట్ తాజాగా సెలబ్రేషన్స్ నిర్వహించింది. ఈ సినిమాలో నటించిన నటీనటులతోపాటు పలువురు సాంకేతిక నిపుణులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. గతేడాది అందరికీ ఓ చేదు జ్ఞాపకమని, తనకు మాత్రం ఎప్పటికీ మర్చిపోలేని తీపి జ్ఞాపకమని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పేర్కొన్నాడు. ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్ మాట్లాడుతూ.. '2020 అందరికీ ఓ చేదు జ్ఞాపకం. నాకు మాత్రం ఎప్పటికీ మర్చిపోలేని తీపి జ్ఞాపకం. ఈ సినిమా వల్లే లాక్‌డౌన్‌ను బాగా ఎంజాయ్ చేశాను. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఎన్టీఆర్‌ల‌కు ఆల్ టైం రికార్డ్ రావ‌డానికి ఏడు సినిమాల ప‌డితే నాకు 20 సినిమాలు ప‌ట్టింది. ఈ సినిమా ఇచ్చిన జోష్‌తో ఇక నుండి నేనేంటో చూపిస్తానంటూ' ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు బ‌న్నీ. ఈ కార్య‌క్ర‌మానికి చిత్ర నిర్మాతలు అల్లు అరవింద్, సూర్యదేవర నాగవంశీ, దర్శకుడు త్రివిక్రమ్, హీరో అల్లు అర్జున్, హీరోయిన్ పూజా హెగ్డే, విలన్ సముద్రఖని, ఇతర నటీనటులు శశాంక్, సునీల్, నవదీప్‌తో పాటు టెక్నీషియన్స్  హాజ‌ర‌య్యారు.