విజయ్ సారీ.. నీ కోసం రాలేదు: బన్నీ

విజయ్ సారీ.. నీ కోసం రాలేదు: బన్నీ

యంగ్ హీరో విజయ్ దేవరకొండ తాజాగా నటించిన సినిమా 'గీత గోవిందం'. పరుశురాం దర్శకత్వంలో తెరకెకెక్కిన ఈ చిత్రం ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందింది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన రష్మిక మందన హీరోయిన్ గా నటించింది. గోపిసుందర్ సంగీతం సమకూర్చారు. ఆగష్టు 15న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ఈ  సినిమా ఈ రోజు ఆడియో లాంచ్ చేసుకుంది. ఈ వేడుకకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిధిగా వచ్చారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ... 'విజయ్  సారీ.. నీ కోసం రాలేదు. నాకు ఎంతో ఆప్తుడైన బన్నీ వాసు కోసమే వచ్చాను' అని అన్నారు. ఒక ఆడియన్ గా ఈ సినిమా చూసాను.. చాలా బాగుంది అని బన్నీ తెలిపారు.

ఈ సినిమాలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన బాగా ఆక్ట్ చేశారన్నారు. 'ఇంకేం ఇంకేం కావలి' అనే సాంగ్ బాగా నచ్చింది. పరుశురాం గారు ఈ సినిమా మీకు బెస్ట్ అవుతుందన్నారు. రష్మిక మందనకు ఈ సినిమాలో బెస్ట్ చారెక్టర్ వచ్చింది అని బన్నీ  తెలిపారు. 'అర్జున్ రెడ్డి' సినిమా చూసాక నేను వారం రోజులు డిస్టబ్ అయ్యాను. బెస్ట్ యాక్టర్ అవార్డు వస్తుందని అనుకున్నాను.. అలాగే వచ్చిందన్నారు. ఇక చివరగా డాడీ బాగా డబ్బులు సంపాదించి నాకు ఒక మంచి కారు  కొనివ్వండని అల్లు అరవింద్ గారిని కోరారు.