అల్లు అర్జున్.. సుకుమార్ సినిమా ఓపెనింగ్ డేట్ వచ్చేసింది

అల్లు అర్జున్.. సుకుమార్ సినిమా ఓపెనింగ్ డేట్ వచ్చేసింది

నాపేరు సూర్య తరువాత అల్లు అర్జున్ చాలా గ్యాప్ తీసుకొని త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేస్తున్నాడు.  ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వేగంగా జరుగుతున్నది.  ఫాదర్ సెంటిమెంట్ ఆధారంగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.  ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగా తనకు ఆర్య వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన సుకుమార్ తో సినిమా చేసేందుకు సిద్ధం అయ్యాడు బన్నీ.  

సుకుమార్ చెప్పిన స్టోరీ నచ్చడంతో ఒకే చెప్పేశాడు.  ఈ సినిమా మే 11 వ తేదీన ప్రారంభం కాబోతున్నది.  ప్రస్తుతం సుకుమార్ స్క్రిప్ట్ కు ఫైనల్ టచ్ ఇచ్చే పనిలో ఉన్నాడు.  రష్మిక మందన్న హీరోయిన్ గా చేస్తోన్న ఈ మూవీ ఎర్రచందనం బ్యాక్ డ్రాప్ స్టోరీగా తెరకెక్కిస్తారట.  తిరుపతి, నెల్లూరు తదితర ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతుందని సమాచారం.  మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది.