అల్లు అర్జున్ కొత్త సినిమా ప్రకటన !

అల్లు అర్జున్ కొత్త సినిమా ప్రకటన !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమా వచ్చి చాలా నెలలే అవుతోంది.  ఈ ఏడాది ఇంకా ఆయన కొత్త సినిమా మొదలుకాలేదు.  త్రివిక్రమ్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమా ఇంకా ప్రీ ప్రొడక్షన్ దశలోనే ఉంది.  ఇదిలా ఉండగానే బన్నీ ఇంకో కొత్త సినిమాను సెట్ చేసుకున్నాడు.  ఆ సినిమా వివరాల్ని ఈరోజు మధ్యాహ్నం 3:30 గంటలకు అనౌన్స్ చేయనున్నాడు.  ఇది బన్నీకి 20వ సినిమా కావడం విశేషం.  సినిమా దర్శకుడు ఎవరు, చిత్రం ఎప్పుడు మొదలవుతుంది వంటి వివరాలు తెలియాలంటే ఇంకొంత సేపు ఆగాల్సిందే.