అల్లు అర్జున్.. మొత్తం నాలుగు గెటప్స్

అల్లు అర్జున్..  మొత్తం నాలుగు గెటప్స్

 

త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న చిత్రం ఒక కొలిక్కి రాగానే అల్లు అర్జున్ తన తర్వాతి సినిమాను స్టార్ట్ చేయనున్నారు.  ఈ చిత్రాన్ని వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేయనున్నారు.  ప్రముఖ నిర్మాత అల్లు అర్జున్ భారీ బడ్జెట్ కేటాయించి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.  తాజా సమాచారం మేరకు బన్నీ ఈ సినిమాలో మొత్తం నాలుగు భిన్నమైన గెటప్స్ ట్రై చేస్తారని తెలుస్తోంది.  వాటిలో ఒకటి యంగ్ క్యారెక్టర్ కాగా ఇంకొకటి మధ్య వయస్కుడి పాత్రని తెలుస్తోంది.  ఇక మిగిలిన రెండు పాత్రలు ఎవనేది తెలియాల్సి  ఉంది.  ఈ చిత్రానికి 'ఐకాన్' అనేది టైటిల్ కాగా 'కనబడుటలేదు' అనేది ఉపశీర్షిక.