స్పెషల్ డే రోజున అల్లు అర్జున్ సినిమా ప్రారంభం..!!

స్పెషల్ డే రోజున అల్లు అర్జున్ సినిమా ప్రారంభం..!!

నాపేరు సూర్య సినిమా తరువాత అల్లు అర్జున్ మరో సినిమా చేయలేదు.  దాదాపు ఏడాది గ్యాప్ తీసుకున్నాడు.  కథలు విన్నా పెద్దగా వర్కౌట్ కాకపోవడంతో సినిమా ఆలస్యం అయింది.  కాగా, ఇప్పుడు బన్నీ.. త్రివిక్రమ్ తో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు.  సినిమాను రీసెంట్ గా ఎనౌన్సమెంట్ చేసినా ఎప్పుడు స్టార్ట్ అవుతుందనే విషయాన్ని మాత్రం బయటపెట్టలేదు.  

అల్లు అర్జున్ 19 సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ బయటకు వచ్చింది.  రామ్ చరణ్ బర్త్ డే రోజైన మార్చి 27 వ తేదీన ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభం కాబోతున్నట్టు సమాచారం.  జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి వంటి హిట్ సినిమాలు బన్నీ, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చాయి.  వీరి కాంబినేషన్లో రాబోతున్న మూడో సినిమాకూడా హిట్ ఫాదర్ సెంటిమెంట్ తరహాలోనే ఉండబోతుందట.