బన్నీ... త్రివిక్రమ్ సినిమా షూటింగ్ డేట్ ఫిక్స్

బన్నీ... త్రివిక్రమ్ సినిమా షూటింగ్ డేట్ ఫిక్స్

అల్లు అర్జున్ 19 వ సినిమా కొన్ని రోజుల క్రితమే ప్రకటించారు.  ఈ సినిమాకు సంబంధించిన వివరాలు మాత్రం ఇప్పటి వరకు ప్రకటించలేదు.  త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్స్ కార్యక్రమాలను జరుపుకుంటోంది.  

హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీత ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.  థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్ 24 వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్నది.  గతంలో త్రివిక్రమ్ తో కలిసి అల్లు అర్జున్ రెండు సినిమాలు చేశాడు.  రెండు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి.