బన్నీ... త్రివిక్రమ్ సినిమా ప్రారంభం

బన్నీ... త్రివిక్రమ్ సినిమా ప్రారంభం

నాపేరు సూర్య తరువాత చాలా గ్యాప్ తీసుకున్న బన్నీ... వరసగా మూడు సినిమాలు చేసేందుకు సిద్ధం అయ్యాడు.  అందులో మొదటి సినిమా త్రివిక్రమ్ తో. త్రివిక్రమ్ తో చేస్తున్న ఏఏ 19 సినిమా ఈరోజు పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది.  ఏప్రిల్ 24 నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది.  బన్నీతో కలిసి డీజే లో స్టెప్పులు వేసిన పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్.  

హారిక అండ్ హాసిని, గీతా ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.  థమన్ సంగీతం అందిస్తున్నాడు.  ఈ సినిమా తరువాత అల్లు అర్జున్ దర్శకుడు వేణు శ్రీరామ్ తో ఐకాన్.. కనబడటం లేదు, తనకు ఆర్య, ఆర్య 2 వంటి భారీ హిట్స్ ఇచ్చిన సుకుమార్ తో ఓ సినిమా చేస్తున్నాడు.  ఈ మూడు సినిమాలు వరసగా లైన్లో ఉండటంతో మళ్ళీ బన్నీ బిజీ కాబోతున్నాడన్నమాట.