నెట్టింట హల్ చల్ చేస్తున్న బన్నీ ఆరవ వేలు మ్యాటర్ .. 

నెట్టింట హల్ చల్ చేస్తున్న బన్నీ ఆరవ వేలు మ్యాటర్ .. 

సెలబ్రెటీలకు సంబంధించి ఏ చిన్న వార్త తెలిసిన అది నెట్టింట వైరల్ అవ్వాల్సిందే.. నేడు అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ ను విడుదల చేశారు. ఈ చిత్రానికి సంబంధించి రెండు పోస్టర్స్ విడుదల చేశారు మేకర్స్‌. రెండో పోస్టర్స్ జనాలలో ఎక్కడ లేని అనుమానాలని కలిగించింది. రెండవ పోస్టర్ లో అల్లు అర్జున్ కాలికి ఆరవ వేలు ఉందని, ఇది సుకుమార్ కథ కోసం సృష్టించాడా లేక బన్నీకి ఆరవ వేలు ఉందా అనే చర్చ సోషల్ మీడియాలో హాట్ హాట్‌గా నడుస్తూ వస్తుంది.మొత్తానికి అల్లు అర్జున్ పుష్ప లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సందర్బంగా ఈ విషయం పై కూడా విశేషంగా చర్చ జరుగుతోంది. మరి ఆరవ వేలుపై సినిమా యూనిట్ స్పందిస్తారేమో చూడాలి. ఇక అల్లు అర్జున్ ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్ కాబోతున్నాడు. ఈ సినిమాని తెలుగు,హిందీ,తమిళం,మలయాళం కన్నడ కలిపి ఐదు భాషల్లో రిలీజ్ చేస్తున్నారు