బన్నీకి సతీమణి నుంచి స్పెషల్ బర్త్ డే విషెష్

బన్నీకి సతీమణి నుంచి స్పెషల్ బర్త్ డే విషెష్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన 38వ పుట్టినరోజును కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ లో జరుపుకుంటున్నారు. సోషల్ మీడియాలో సెలెబ్రిటీల నుంచి, అభిమానుల నుంచి అల్లు అర్జున్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి ఆయన స్పెషల్ గా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇంతకుముందు మాల్దీవుల్లో బన్నీతో కలిసి దిగిన పిక్ ను షేర్ చేసిన స్నేహారెడ్డి 'హ్యాపీ బర్త్ డే అర్జున్' అంటూ కామెంట్ చేశారు. ఆ పిక్ లో బన్నీ, స్నేహారెడ్డి స్టైలిష్ లుక్ లో కన్పిస్తున్నారు. తమ పిల్లలతో కలిసి ఉన్న మరో పిక్ ను షేర్ చేసిన స్నేహారెడ్డి... దానికి 'లవ్ యూ' అనే స్టిక్కర్ ను జోడించారు.   

ఇక ఇటీవల అల్లు అయాన్ పుట్టినరోజు వేడుకలు మాల్దీవుల్లో సెలెబ్రేట్ చేసుకున్న బన్నీ ఫ్యామిలీ ఏప్రిల్ 6న తిరిగి హైదరాబాద్ వచ్చారు. ఆ తరువాత అల్లు అర్జున్ నిన్న హైదరాబాద్ లో జరిగిన పుష్ప టీజర్ లాంచ్ కార్యక్రమానికి హాజరయ్యారు. 'పుష్ప' టీజర్ విడుదలైన కొన్ని గంటల్లోనే భారీ వ్యూస్ తో సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో 'పుష్ప' టీజర్ ట్రెండ్ అవుతోంది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ ఆగష్టు 13న  ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.