మరో హోటల్ ను ఓపెన్ చేసిన అల్లు అర్జున్

మరో హోటల్ ను ఓపెన్ చేసిన అల్లు అర్జున్

సినిమా ఒక వ్యాపారంగా మారిపోయింది.  ఈ రంగంలో డబ్బు సంపాదించిన నటీనటులు, వాటిని మరో వ్యాపారంలో పెట్టుబడిగా పెడుతున్నారు. మరోవైపు స్టార్ హోదా సంపాదించుకున్నాక.. యాడ్స్ లో నటిస్తూ.. ఎండార్స్మెంట్  కోట్లు ఆర్జిస్తుంటారు.  ఇదిలా ఉంటె, టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ హైదరాబాద్ నగరంలో రెండో హోటల్ ను ప్రారంభించారు.  

ఇప్పటికే బి డబ్స్ పేరుతో ఒక రెస్టారెంట్ ఉన్నది.  గచ్చిబౌలిలో ఏర్పాటు చేసింది బ్రాండ్ రెస్టారెంట్.  బి డబ్స్ అన్నది అమెరికన్ ఫేమస్ రెస్టారెంట్.  అందులో అల్లు అర్జున్ పార్టనర్ గా ఇండియాలో బ్రాంచ్ లను ఏర్పాటు చేశారు.  తెలుగు రాష్ట్రాల్లోని అన్ని నగరాల్లో బి డబ్స్ రెస్టారెంట్ ను ఓపెన్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు అల్లు అర్జున్ చెప్పుకొచ్చాడు.