నితిన్ దర్శకుడితో అల్లు హీరో !

నితిన్ దర్శకుడితో అల్లు హీరో !

అల్లు శిరీష్ నటించిన కొత్త చిత్రం 'ఏబిసిడి'.  గత వారం విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పర్వాలేదని వసూళ్లను సాధిస్తోంది.  ఇక శిరీష్ అయితే తన నెక్స్ట్ సినిమా పనుల్ని కూడా మొదలుపెట్టేశాడు.  ప్రేమ్ సాయి అనే దర్శకుడితో వర్క్ చేయడానికి సిద్దమయ్యాడట శిరీష్.  ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుంది, హీరోయిన్ ఎవరు వంటి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.  ఇకపోతే ప్రేమ్ సాయి గతంలో నితిన్ హీరోగా 'కొరియర్ బాయ్ కళ్యాణ్' అనే చిత్రాన్ని తెరకెక్కించాడు.