రౌడి హీరోకు థాంక్స్ చెప్పిన అల్లు అర్జున్..ఎందుకంటే..

రౌడి హీరోకు థాంక్స్ చెప్పిన అల్లు అర్జున్..ఎందుకంటే..

అల్లుఅర్జున్ ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. తనదైన నటనతో, స్టైల్‌తో స్టైలిష్ స్టార్‌గా పేరు తెచ్చుకున్నాడు. అయితే అర్జున్ ప్రస్తుతం పుష్పా అనే పాన్ ఇండియా సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో ఎర్రచదంనం దొంగగా కనిపించనున్నాడని వార్తలు వస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కొంతకాలం ఆపేందుకు నిశ్చయించుకున్నారు. అయితే ఇటీవల అల్లుఅర్జున్ ట్విటర్ వేదికగా రౌడీ హీరో విజయ్ దేవరకొండకు, రౌడీ క్లబ్‌కు కృతజ్ఞతలు తెలిపాడు. ఎందుకని ఆలోచిస్తున్నారా.. దానికి కారణం విజయ్ పంపిన రెండు ఫొటోలు. ఆ ఫొటోలలో అర్జున్ స్టైల్‌గా, ఆవ్‌సమ్ లుక్‌తో ఉన్నాడు. దాంతో ఆ ఫొటోలు నిట్టింట హల్ చల్ చేయడంతో అర్జున్ వాటిపై స్పందించాడు. ‘నేను విజయ్‌తో పాటు రౌడీ క్లబ్‌కు కృతజ్ఞతలు తెపాలి. ఇంత మంచి ఫోటోలను పంపినందుకు చాలా థాంక్స్ లవ్‌లీ బ్రదర్ అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ కూడా వైరల్ అవుతుంది. అయితే విజయ్ ప్రస్తుతం అనన్య హీరోయిన్‌గా పూరీ దర్శకత్వంలో ఫైటర్ అనే సినిమాను చిత్రీకరిస్తున్నాడు.