రసూల్ పురాలో బన్నీ..త్రివిక్రమ్ సినిమా

రసూల్ పురాలో బన్నీ..త్రివిక్రమ్ సినిమా

అల్లు అర్జున్ 19 వ సినిమా త్రివిక్రమ్ తో చేస్తున్న సంగతి తెలిసిందే.  ఈ సినిమా పూజా కార్యక్రమాలు చాలా రోజుల క్రితం జరిగాయి.  ఈరోజు నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయ్యింది.  హైదరాబాద్ లోని బేగంపేట పోలీస్ లైన్స్ లో షూటింగ్ జరుగుతున్నది.  బన్నీ.. త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న మూడో సినిమా కావడంతో ఆసక్తి పెరిగింది.  గతంలో వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు హిట్ కావడంతో మూడో సినిమాపై కూడా అంచనాలు ఉన్నాయి.  ఈ సినిమా కూడా తండ్రి సెంటిమెంట్ తో ఉండబోతున్నట్టు సమాచారం.  

పూజా హెగ్డే హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమాలో ప్రముఖ నటి టబు కీలక పాత్ర చేస్తున్నది.  తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా దసరాకు రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం.